కమర్షియల్ కోణం లో ఆలోచన చేసి చేస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. దీనితో నిర్మాతలు ఇప్పుడు ఎక్కువగా నష్టపోతున్నారు అనేది అర్ధమవుతుంది. దీనితో వాళ్ళు ఇప్పుడు సేఫ్ గేమ్ఆడాలని చూస్తున్నారు. హీరోలకు అంత పారితోషికం ఇవ్వాల్సిన అవసరం లేదని చిన్న హీరోఅయితే ఆలోచించి ఇవ్వాలని, అగ్ర హీరోఅయితేనే అది కూడా భారీ బడ్జెట్ సినిమాఅయితేనే చెయ్యాలి అనే అభిప్రాయానికి వచ్చేశారు నిర్మాతలు. దర్శకులు మంచి కథలు తీసుకొచ్చినా ఆలోచించి ముందుకి వెళ్తున్నారు.
టాలీవుడ్హీరోల విషయంలో మంచి అభిప్రాయం ఉండేది. కమర్షియల్ సినిమాలు అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ మీద సీరియస్ గా ఉండే వాళ్ళ సంఖ్య అనేది ఎక్కువగా ఉంది అనేది వాస్తవం. టాలీవుడ్లో హీరోల ఆధారంగానే సినిమాలు వస్తూ ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళే లాభాల్లో ఎక్కువగా తీసుకోవడం తో మాకు ఏమీ ఉండటం లేదు అనే అభిప్రాయానికి దర్శక నిర్మాతలు వచ్చేశారు. ఎంత సేపు వాళ్ళ కోరికలను తీర్చడమే గాని మా పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదని ఎందరో దర్శక నిర్మాతలు వాపోతున్నారు.
]]>