Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305555

లాక్ డౌన్ ఏంటి.. అదంతా జాన్ తా నై.. బీజేపీ ఎమ్మెల్యే గ్రాండ్ దావత్..?

$
0
0
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశంలో విరుచుకుపడుతున్న కరోనా వైరస్ని తరిమి కొట్టేందుకు కేంద్రప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను  ప్రజలందరూ పాటించాలని ఎంతోమంది రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు ప్రజలకు పిలుపునిస్తున్నారు. లేనిపక్షంలో దేశం మరింత క్లిష్ట పరిస్థితుల్లో పడిపోతుంది అంటూ చెబుతున్నారు. ఇక ప్రజాప్రతినిధులు అయితే ఎప్పుడు ప్రజలకు పలు సూచనలు సలహాలు ఇస్తూ లాక్ డౌన్ పాటించాలి అని సూచిస్తున్నారు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజలకు చెప్పాల్సింది పోయి వాళ్లే లాక్ డౌన్  విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు లాక్ డౌన్ నిర్లక్ష్యం చేయ వద్దు అంటూ చెప్పాల్సిన ప్రజాప్రతినిధులే... లాక్ డౌన్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం పై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


 కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  భారత దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్  ప్రజాప్రతినిధులకు వర్తించదేమో  అని సోషల్ మీడియాలో కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ లాక్ డౌన్  ఉల్లంఘించిన ఆ ప్రజాప్రతినిధి ఎవరూ అంటారా... కర్ణాటకకు చెందిన ఒక బీజేపీఎమ్మెల్యే. ప్రస్తుతం సాధారణ ప్రజలు లాక్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి వేడుకలు సంబరాలు జరుపుకోకుండా  సైలెంట్ గా ఉన్నారు కానీ ఇక్కడ ఓ బిజెపిఎమ్మెల్యేమాత్రం తన బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా  సెలబ్రేట్ చేసుకున్నాడు. నెత్తిన తలపాగా ధరించి చేతికి గ్లౌజులు వేసుకుని భారి  చాక్లెట్కేక్ కోసి అందరికీ పంచాడు. ప్రస్తుతం ఈ  ఎమ్మెల్యేతిరుగుబాటు సోషల్ మీడియాలో ఇటు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. 




 కర్ణాటకలోని తుముకూరు జిల్లాతురువికెరె  ఎమ్మెల్యేజయరామ్ గుబ్బి  పట్టణంలో ఆయన బర్త్ డే వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే మామూలుగానే ప్రజాప్రతినిధుల బర్త్ డే లు  అంటే ఎంతో గ్రాండ్ గా  జరుగుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా అలాగే జరిగింది కానీ లాక్ డౌన్  అమలులో ఉంది అనే విషయాన్ని మాత్రం ఆ ఎమ్మెల్యేమర్చిపోయాడు. దీంతో అక్కడికి చాలా మంది జనం రావడంతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. కాగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్కడికి వచ్చిన వారందరికీ సదరు ఎమ్మెల్యేబిర్యానీ వండింది పెట్టించారు. ఏదేమైనా పదిమందికి లాక్ డౌన్ పాటించాలి అని చెప్పి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఎమ్మెల్యేనే లాక్ డౌన్  విడిచి పెట్టడం ఎంతో బాధాకరం.

]]>

Viewing all articles
Browse latest Browse all 305555

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>