అయితే ఈ నేపథ్యంలోనే చాలా మంది నిరుపేదలు ప్రభుత్వం సూచించిన విధంగా నిత్యవసర సరుకులు సహా ఆహారాన్ని కూడా అందుకుంటున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అందరు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం అందించిన ఈ వసతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే కేవలం అర్హులైన వారికి మాత్రమే ఆహార పదార్థాలను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. కానీ అక్కడ ఇక్కడ అనర్హులైన వారు కూడా ఈ సహాయాన్ని అందుకుంటున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా రాజస్థాన్లోని అజ్మీర్ లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆకలితో అలమటిస్తున్నారు అంటూ... ప్రభుత్వ సహాయాన్ని కోరాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాలనా విభాగం అతనికి అవసరమైన సహాయ సామాగ్రి పంపిణీ చేసింది .
ఈ క్రమంలోనే సదరు వ్యక్తికి సామాగ్రిని పంపిణీ చేసేందుకు వెళ్లిన అధికారులు అతని ఇంటిని చూసి విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని జిల్లాఅదనపు కలెక్టర్హీరా లాల్ మీనాతెలిపారు. కాన్పూర్కు చెందిన చంద్ అహ్మద్... ప్రభుత్వం సూచించిన జిల్లాకంట్రోల్ రూమ్ కి ఫోన్చేసే... ఆహారం సహా ఇతర సామాగ్రి కావాలి అంటూ కోరాడు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి కోరిన సామాగ్రిని తీసుకొని అధికారులు అతని ఇంటికి చేరుకోగా అతని ఇల్లు చూసి అధికారులు షాక్ అయ్యారు. అతని ఇంటిలో మోటార్ సైకిల్గ్యాస్ సిలిండర్లు ఫ్రిడ్జ్ కూలర్ లు మొదలైన అన్ని నిత్యావసర వస్తువులు కనిపించాయి. దీంతో అర్హులకు చెందాల్సిన సహాయాన్ని అనర్హుడు అయిన వ్యక్తి అందుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి పై అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
]]>