Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298116

కరోనా కుటుంబం గురుంచి కొత్త అధ్యయనంలో సంచలన నిజాలు.. వైరస్ ఎన్నిరకాలో తెలుసా..?

$
0
0
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా  గురించి రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఎన్నో పరిశోధనలు జరుపుతున్న నేపథ్యంలో ప్రతి పరిశోధనలో ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇక వచ్చే నెలలో కరోనా వైరస్గురించి మరో నిజం బయట పడింది. చైనాలోని వుహాన్  నగరంలో తొలి కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి... ఇప్పటివరకు వైరస్ లో ఎలాంటి జన్యు మార్పులు జరిగాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు... బ్రిటన్లోని క్రైమ్ బ్రిడ్జ్ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో... ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


 ఈ అధ్యయనంలో  భాగంగా డిసెంబర్ 24 నుంచి మార్చి 4 మధ్యకాలంలో... 160 మంది నుంచి శాంపిల్స్ ను  సేకరించారు పరిశోధకులు. ఇక వారి శాంపిల్ ఆధారంగా  వైరస్ లో  జరిగే మార్పులను పరిశీలించారు. అయితే ఈ ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్ రెండు నెలల వ్యవధిలో మూడు రకాల జన్యు  మార్పులతో కూడిన... కరోనా వైరస్లు ఇన్ఫెక్షన్ కారణం అయ్యాయి అంటూ ఈ అధ్యయనంలో సంచలన నిజాలు బయటపడ్డాయి. మూడు రకాల జన్యు మార్పులకు గాను ఏ, బి, సి అనే పేరు పెట్టారు పరిశోధకులు. ఈ వైరస్ మనుషులకు ప్రబలడానికి ఏ వైరస్ ఊతం ఇస్తే... దీనిలో జన్యు మార్పులు జరిగి బి వైరస్ ఏర్పడిందని ఆ తర్వాత సి  రకం వైరస్ ఏర్పడుతుంది అంటూ శాస్త్రవేత్తలు తెలిపారు. 




 అయితే ఇన్ఫెక్షన్లకు ప్రధాన కేంద్రంగా ఉన్న చైనాలోని వుహాన్  నగరంలో మాత్రం ఏ రకం వైరస్ జాడ అంతగా లేదని కానీ చైనాలోని అమెరికన్ల లో మాత్రం ఏ రకం కరోనా  వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే అమెరికాఆస్ట్రేలియాల్లో  ఎక్కువ మొత్తం కరోనా  వైరస్ బారిన పడిన కేసులు... ఈ  రకమైన వైరస్   ఎక్కువగా కనిపిస్తుంది అంటూ పరిశోధకులు తెలిపారు. ఇక బీ రకం అయిన  వైరస్ కూడా చైనా, ఉత్తర కొరియా,   దక్షిణ కొరియాజపాన్దేశాలకు మాత్రమే  పరిమితమైందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇక సి రకం  వైరస్ ఫ్రాన్స్ఇటలీస్వీడన్ఇంగ్లాండ్వంటి ఐరోపాదేశాల్లో గుర్తించబడింది అంటూ శాస్త్రవేత్తలు తెలిపారు. చైనాలోని కరోనా  వైరస్ జన్యు క్రమానికి సి రకం వైరస్ కు  అసలు పోలికలు లేవంటూ ఈ అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 298116

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>