Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298116

చైనాకు చావు దెబ్బ ?

$
0
0
చైనా...ఇపుడు ప్రపంచ దేశాలకు కరోనాతో పాటే తలచుకునే పేరు అయింది. చైనా వైరస్ అని కూడా అమెరికాప్రెసిడెంట్ ట్రంప్అనేశాడు అంటే ఆయన బాధ, ఆవేశం అంతలా ఉందన్నమాటే. అగ్రరాజ్యాధినేత నోట వచ్చిన ఆ మాటను చైనా తప్ప ప్రపంచం యావత్తూ కూడా ఇపుడు  అంగీకరిస్తోంది కూడా.

ఇక చైనా పుట్టించిన ఈ వైరస్ దేశాలకు దేశాలనే కబలిస్తోంది. ప్రపంచ తీరుని కూడా మార్చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటేకరోనా వైరస్కి ముందు తరువాత అన్నట్లుగా ప్రపంచం పరిస్థితి మారిపోయింది. కరోనా వైరస్నియంత్రించబడినా కూడా ప్రపంచం మళ్ళీ మామూలు స్థితికి  ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని అంతా అంటున్నారు.



 జగత్తు కోలుకోవడానికి కొన్నేళ్ళు పడుతుంది కూడా. అప్పటికి ఎవరు ఉంటారో, ఎవరు పోతారో కూడా తెలియని పరిస్థితి. ఓ విధంగా చైనా అంతర్జాతీయసమాజానికి ద్రోహం చేసిందన్న కోపం అందరిలో ఉంది. చైనాలో ఈ మహమ్మారి ఉన్నపుడు దాని గురించి బయట ప్రపంచానికి తెలియచేస్తే అంతా  సర్దుకునేవారు. కానీ చైనా  సీక్రెట్ పాటించడం వల్లనే ఇపుడు మొత్తం విశ్వం కొంప మునిగింది.



సరే ఇవన్నీ ఇలా ఉంటే చైనాకు తగిన గుణపాఠం చెప్పాలన్న కసి అయితే అగ్ర రాజ్యం అమెరికాలో పూర్తిగా  కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా బాధిత దేశంగా  ఉన్న అమెరికాకోలుకోగానే చైనా పని పట్టేందుకు రెడీ అంటున్నారు. దానికి భారత్లాంటి దేశాల సాయం తీసుకోవాలని కూడా అమెరికాఆలోచిస్తోందని చెబుతున్నారు. 



ఇక భారత్కి కూడా చైనా  తలనొప్పిగానే ఉంది. పొరుగున పాకిస్థాన్ని  ఎగదోస్తూ భారత్మీద పరోక్ష  యుధ్ధానికి చైనా దిగడం భారత్అసలు తట్టుకోలేకపోతోంది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్నియంత్రణ తరువాత ప్రపంచ వేదికమీద భారత్అమెరికాచేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.  




ఈ రెండు దేశాలతో పాటు కరోనా బాధిత దేశాలన్నీ ఒక్క తాటి మీదకు వస్తే చైనా తాట తీయవచ్చునని అంటున్నారు. ప్రపంచానికి చైనా తన వాణిజ్యం ద్వారానే కాసులు చేసుకుంటోంది. చైనాను కట్టడి  చేయడానికి ఉమ్మడిగా నిర్ణయం కనుక తీసుకుంటే మాత్రం డ్రాగన్ కిక్ అది చావు దెబ్బ అవుతుంది. ఓ విధంగా ప్రపంచానికి పెద్దన్న పాత్రలోకి మారాలనుకుంటున్న చైనాను కట్టడి చేయడం ఇపుడు అన్ని దేశాలకు అవసరమన్న భావనబలపడుతోంది. అదే చైనా దూకుడుకి ఇక బ్రేకులు వేస్తుంది. 


]]>

Viewing all articles
Browse latest Browse all 298116

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>