శుక్రవారం నియంత్రణ రేఖవెంబడి శత్రు దేశ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలతోపాటు,పేలుడు పదార్థాల నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులతో విరుచుకుపడింది. ప్రధానంగా నీలమ్ లోయలోని కెల్ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు చెందిన ఓ శిబిరం పూర్తిగా ధ్వంసమైంది. కాగా కెరన్ సెక్టార్‌లో ముష్కరులు ప్రవేశిస్తే వారిని అడ్డుకోవడం చాలా కష్టమని.. అందుకే భారత్ అత్యంత కచ్చితత్వంతో, ప్రణాళిక ప్రకారం దాడులు జరిపిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇకపోతే కుప్వారా జిల్లాకెరన్ సెక్టార్ నుంచి శతఘ్నులతో గురిపెట్టి జరిపిన ఈ భీకర దాడుల్లో పాక్‌కు భారీ స్థాయిలో నష్టం జరిగిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. అయితే భారత్ వైపు ఎలాంటి నష్టం జరగలేదని కూడా స్పష్టం చేశాయి. కాగా ఇదే సెక్టార్‌లో గత ఆదివారం జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమవ్వగా, వారితో పాటుగా ఐదుగురు భారత కమాండోలు కూడా వీర మరణం పొందారు. ఇదిలా ఉండగా భారత్‌లోకి 200 మందికిపైగా ఉగ్రవాదులను పంపించేందుకు పాక్ ప్రయత్నిస్తున్నట్లు తాజాగా నిఘా వర్గాలు హెచ్చరించాయి. వారి ప్రవేశానికి అనుకూల పరిస్థితులు సృష్టించేందుకే భారత బలగాలపైకి పాక్ దళాలు పదే పదే కాల్పులు జరుపుతు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు..
ఇప్పటికే పాకిస్దాన్ దేశ ఆర్ధిక వ్యవస్ద పూర్తిగా కోలుకోలేని దశలో ఉంది.. ఈ కరోనా దెబ్బకు పెద్ద పెద్ద దేశాలే అల్లాడిపోతుండగా పాకిస్దాన్ మరింతగా దిగజారిపోవడం ఖాయమంటున్నారు ఆర్ధిక నిపుణులు.. అయినా గానీ బుద్ధితెచ్చుకోక ఇలాంటి చర్యలకు పాలపడటం దాని కుటిల బుద్ధికి నిదర్శనం..
]]>