అయితే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దెబ్బతింటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా సగానికి పైగా ఆర్థర్ లు రద్దయ్యయి అంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత ఎగుమతి రంగంలో లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా కోటిన్నర ఉద్యోగాలు పోతాయి అంటూ హెచ్చరిస్తోంది. అంతేకాకుండా రోజు రోజుకు ఎగుమతులు తగ్గిపోతున్న నేపథ్యంలో భారతదేశానికి వచ్చే ఆర్డర్ల న్ని చైనా తన్నుకుపోయే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. భారత ఆర్డర్లను చైనా దక్కించుకుంటే చైనా ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగు పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం చైనా దేశంలో కరోనా ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో చైనాలోనే ప్లాంట్లలో ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది.
అయితే మామూలుగానే కావాలని చైనా దేశం కరోనా వైరస్ అనే మహమ్మారిని ప్రపంచ దేశాలపై వదిలింది అనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కరోనా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేయడం ద్వారా చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలని భావించింది అంటూ విమర్శలు కూడా వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చైనా అనుకున్నది కొంచెం కొంచెంగా సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా అన్ని దేశాలు నిర్బంధంలోకి వెళ్లిపోయిన తరుణంలో చైనా దేశం ఈ సమయంలో ఉత్పత్తిని ప్రారంభిస్తే... భారతదేశ ఆర్డర్లు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ఆర్డర్లు చైనా దేశం సొంతం చేసుకుని ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుచుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
]]>