అయితే ఇప్పుడు ఆ శవాలను పూడ్చడానికి ప్రదేశాలు ఉండట్లేదు. రోజురోజుకి అమాంతంగా శవాలు పెరగడంతో ఏం చేయాలో ఇప్పుడు పరిస్థితి అర్థం అవ్వట్లేదు. దీనితో స్మశానంలో స్థలం లేక ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో లేక పబ్లిక్ పార్కులలో ఈ శవాలను ఖననం చేస్తున్నారు. అయితే అక్కడ పెద్ద పెద్ద గుంతలు తవ్వి అందులో వారిని సామూహికంగా ఖననం చేస్తుంది అమెరికాసర్కార్. అయితే దీనిపై ప్రభుత్వానికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాక ఇంకా దారుణమైన పరిస్థితి ఏమిటంటే న్యూయార్క్లో రోడ్ల మీదే శవాలు ఉన్నాయని అంతర్జాతీయమీడియాతెలుపుతోంది.
రోజురోజుకీ అమెరికాలో మరణాల రేటు పెరగడంతో అక్కడ ప్రభుత్వం ఏమి చేయాలో అర్థం కాక ప్రజలను రోడ్ల మీదకు రాకుండా కఠిన ఆంక్షలు మొదలు పెట్టింది. అలాగే అక్కడ పరిస్థితి ఎంతకు దిగజారింది అంటే ఎవరైనా వృద్ధులు ఆసుపత్రులకు వెళితే వాళ్లని జాయిన్ చేసుకోవట్లేదట. దీనితో చివరికి ఆ వృద్ధులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి అమెరికాదిగజారిందని పరిస్థితులు తెలుస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కరోనా ఎప్పటికీ శాంతిస్తుందో వేచి చూడాలి. నిజానికి అక్కడి దేశాలతో పోలిస్తే భారత దేశం నిజానికి చాల సురక్షితంగా ఉందనే చెప్పవచ్చు. దీనితో ఇప్పుడు వివిధ దేశాల్లో ఉన్న అనేక భారతీయులు మన దేశానికి తిరిగి వస్తున్నారు.
]]>