అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి షోలు ఏమి చేయక పోయినప్పటికీ గతంలో మాత్రం వీరు చేసిన షో లు చాలానే ఉన్నాయి. తమదైన వాక్చాతుర్యం తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరు చేసిన షోలలో వీరు ఎంతో అత్యంత సన్నిహితంగా మెలిగారు. దీంతో వీరిపై ఎన్నో వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇద్దరి మధ్య ఏదో ఉందని రిలేషన్షిప్ నడుస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి షోలు చేయకపోవడంతో ఆ వార్తలు కాస్త సద్దుమణిగాయి. అయితే తామిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనే విషయాన్ని రవి, శ్రీముఖి స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగాఅనే కార్యక్రమానికి హాజరైన రవిశ్రీముఖి... ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనే ప్రశ్నకు సమాధానం సమాధానం ఇచ్చి అందరికీ క్లారిటీ ఇచ్చారు. తామిద్దరి మధ్య ఉన్నది వృత్తిపరమైన సంబంధమే అని... వ్యక్తిగత సంబంధం కాదు అంటూ శ్రీముఖిరవిచెప్పుకొచ్చారు. టీవీప్రోగ్రాం చేస్తున్నప్పుడు ప్రేక్షకులను అలరించడానికి కాస్త వినోదాన్ని పంచేందుకు కొంత సన్నిహితంగా మెలగాల్సిన అవసరం ఉంటుందని... అందుకే కెమెరా ముందు ఎంతో క్లోజ్ గా ఉంటాము అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటివి చూసి తమ మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది అని ప్రేక్షకులు అనుకుంటారని... కాని తమ మధ్య అలాంటి రిలేషన్షిప్ ఏమీ లేదని కేవలం స్నేహితులు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. తామేంటో తమ కుటుంబ సభ్యులకు తెలుసు అంటూ తెలిపారు ఇద్దరు యాంకర్లు .
]]>