ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. ఈనేపథ్యంలో కరోనా కట్టడికి జిల్లాకలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం చికెన్, మటన్ స్టాల్స్ దగ్గర భారీ సంఖ్యలో జనం గుమిగూడుతున్న దృష్ట్యా సంపూర్ణ లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారు.
]]>
దీని వలన సాధారణ రోజుల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు ఇచ్చిన వెసులుబాటు కూడా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. అలానే జిల్లాలోని అన్ని రెడ్‌జోన్ల పరిధిలో ఉన్న వారు ఎవరూ బయటకు వెళ్లే వీలులేదని చెప్పారు.
కాగా మెడికల్ షాపులు, ఆస్పత్రులకు మా త్రం ఆదివారం మినహాయింపు ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. అలానే రోజు మార్చిరోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ను జిల్లాఅంతటా అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
]]>