Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298166

ఎఫ్ 3 పట్టాలెక్కేది అప్పుడేనట..?

$
0
0
తెలుగు చిత్ర పరిశ్రమలో యువదర్శకుడు అనిల్రావిపూడి ఓటమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల పల్స్ ని పట్టేసిన ఈ దర్శకుడు ప్రేక్షకులందరికీ నచ్చి మెచ్చే విధంగా సినిమాలను తెరకెక్కించి సంచలన విజయాలను అందుకుంటున్నారు . చిన్న హీరోఅయినా పెద్ద హీరోఅయినా తనదైన  టేకింగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు యువదర్శకుడు అనిల్రావిపూడి. పటాస్అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన అనిల్రావిపూడి మొదటి సినిమాతోనే తనదైన మార్క్ చూపించి  ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించాడు . మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు అనిల్రావిపూడి. ఆ తర్వాత రాజా ది గ్రేట్, సుప్రీమ్లాంటి సినిమాలు తెరకెక్కించిన తన సత్తా చాటాడు. 


 ఇక గతేడాది ఎఫ్2సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి  అందరినీ కడుపుబ్బ నవ్వించాడు అనిల్రావిపూడి. మెగా హీరోవరుణ్తేజ్ సీనియర్ హీరోవెంకటేష్కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాసంచలన విజయాన్ని నమోదు చేసింది . కథ పరంగా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే విధంగా తనదైన టేకింగ్ తో ఆకట్టుకున్నాడుఅనిల్రావిపూడి. ఇక ప్రేక్షకులకి ఎప్పుడూ ఎవర్గ్రీన్ ఫేవరెట్ సినిమాగా నిలిచే విధంగా ఎఫ్ 2సినిమాఉంది . అయితే ఎఫ్ 2సినిమామంచి విజయం సాధించడంతో సీక్వల్  తీయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి లైన్ కూడా అనుకున్నట్లు అనిల్రావిపూడి గతంలో క్లారిటీ ఇచ్చాడు. 




 ఇక ఇప్పుడు ఎఫ్ 3 కి సంబంధించిన స్క్రిప్టుపైనే కసరత్తులు చేస్తున్నారు ఈ యువదర్శకుడు. ఎఫ్ 2సీక్వెల్ లోనూ వెంకటేష్వరుణ్తేజ్ నటించిననున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో హీరోఎవరు అనేది మాత్రం ప్రస్తుతం అందరికీ ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం విక్టరీవెంకటేష్నారప్పఅనే రా  కంటెంట్ సినిమాకోసం రెడీ అవుతుండగా... స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమాకోసం మెగా హీరోవరుణ్తేజ్ రెడీ  అవుతుంన్నాడు . ఇద్దరు హీరోల సినిమాలు  అక్టోబర్నాటికి పూర్తి కానున్నాయి. కాగా ఈ  రెండు సినిమాలు పూర్తవగానే అనిల్రావిపూడి తన సినిమాను పట్టాలెక్కించే  పనిలో పడ్డాడట యువదర్శకుడు అనిల్రావిపూడి.

]]>

Viewing all articles
Browse latest Browse all 298166

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>