లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ళనుండి బయటికి రాలేక ఇంట్లో గడవక ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు . నిత్యావసర సరుకులు కొండని బయటిరావాలంటేనే భయపడే పరిస్థితి ఈరోజు మన ఇండియాలో ఏర్పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ NGO లు తమకు తోచిన సాయం చేస్తున్నారు . ఇందులో భాగంగా నగరిఎమ్మల్యే రోజాతన నియోజక వర్గంలో పర్యటించి నగరివాసులకు నిత్యావసలను తానే స్వయంగా ఇంటింటికి వెళ్ళి అందజేశారు .
అదేవిధంగా కరోనా వ్యాప్తి ఎలా వస్తుందో దాని నుండి ఎలా రక్షించుకోవాలో వివరించారు . తన నియోజక ప్రజలకు ఓ అండగా నిలిచారు .మరియు ప్రతి ఇంటికి మాస్క్ లను పంపిణి చేసారు. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్లో 381 కేసులు నమోదు కాగా కర్నూల్ జిల్లాలో కొత్తగా నమోదు అయిన 5 పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం 386 కేసులు నమోదు కావడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్లో ఆరు మరణాలు సంభవించాయి . ఆంధ్ర ప్రదేశ్లో అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 82 కేసులు పాజిటివ్ కావడం విశేషం . ఇదంతాకూడా మర్కజ్ నిజాముద్దీన్ ప్రార్ధనల అనంతరం ఎక్కవైనట్లుగా ప్రభుత్వం గుర్తించింది
]]>