యంగ్ హీరోనాగ శౌర్య, కథ అందించి నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం నాగశౌర్యకు మరో ప్లాప్ ను అందించింది. నూతన దర్శకుడు రమణతేజ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాశాటిలైట్ హక్కలను జెమినిటీవి దక్కించుకోగా డిజిటల్ హక్కలను సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. దాంతో ఈనెల 24 న సన్ నెక్స్ట్ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ లో ఉంచనుంది. మెహ్రీన్కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని నాగ శౌర్యసొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్నిర్మించింది.
]]>
ప్రస్తుతం నాగ శౌర్య ,నూతన దర్శకురాలు లక్ష్మిసౌజన్య తో ఓ సినిమాచేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పెళ్ళి చూపులు ఫేమ్ రీతూ వర్మహీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాఅవుట్ ఫుట్ ఆశించిన స్థాయిలో లేదని రూమర్స్ వస్తున్నాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై లో విడుదలకానుంది. ఈ సినిమాతోపాటు శౌర్య మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అందులో భాగంగా సుబ్రహ్మణ్యపురం ఫేమ్ సంతోష్జాగర్లపూడి డైరెక్షన్ లో నాగశౌర్యసినిమాచేయడానికి ఓకే చెప్పాడు. గత ఏడాదే సినిమాలాంచ్ అయ్యింది. ఏషియన్ సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈసినిమాతోపాటు శౌర్య ,రాజా డైరెక్షన్ లో కూడా నటించనున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై మహేష్ ఎస్ కోనేరు నిర్మించనున్న ఈచిత్రంలో బిగిల్బ్యూటీఅమ్రితా అయ్యర్ హీరోయిన్గా నటించనుందని టాక్. జూన్ నుండి ఈ సినిమాసెట్స్ మీదకు వెళ్లనుంది.