జుట్టు మనిషికి అందాన్ని రెట్టింపు చేయడంలో జుట్టు పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా ఆడవారికి జుట్టే అందం. జుట్టు ఊడిపోతున్నా, జుట్టు లేకున్నా ఆడవారి అందం వ్యర్ధం అవుతుంది. అందుకే ముఖ్యంగా ఆడవారు జుట్టుని పెంచడం మాత్రమే కాదు పెరిగిన జుట్టుని ఆరోగ్యవంతంగా కూడా చూసుకోవాలి. చాలా మందికి జుట్టు ఎంతో ఒత్తుగా, నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. కానీ కొంత కాలం తరువాత అదే జుట్టు పెళుసులు పెళుసులుగా మారిపోతుంది. అందుకు కారణం సరైన పోషకాలు జుట్టుకు ఇవ్వకపోవడం..జుట్టు రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోక పోవడంవలనే..మరి జుట్టుని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎలాంటి పోషకాలు జుట్టుకి అందించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- జుట్టుని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది కేవలం తలనిండా స్నానం చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అయితే తన స్నానం రసాయనిక షాంపూలతో కాకుండా సహజసిద్దమైన కుంకుడు లేదా సీకాయలతో చేస్తే ఇంకా మంచిది. ఇవి చుంద్రుని తరిమేయడమే కాకుండా జుట్టుకి పోషణని ఇవ్వడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
- ఇక కొబ్బరి నూనె. స్వచ్చమైన కొబ్బరి నూనెతీసుకుని కుదుళ్ళకి పట్టేలా మర్దనా చేసి తలకి పట్టిస్తే కురులు ఎంతో అందంగా తయారవుతాయి. ముఖ్యంగా జుట్టు పట్టులా మెరవాలంటే తప్పకుండా కొబ్బరి నూనెక్రమంగా వాడటం ఎంతో మంచిది.
- జుట్టుని కనీసం నెల రోజులకి ఒక సారి చివర్లు కత్తిరించండి. ఇలా చేయడం వలన జుట్టు అందంగా కనబడటమే కాకుండా జుట్టు వేగంగా ఎదగడానికి సాహాయ పడుతుంది. అలాగే జుట్టుకి పోషణ , రక్షణ ఇవ్వడంలో నిమ్మకాయకి ప్రత్యేకత ఉంది. నిమ్మని జుట్టు కుడుళ్ళకి పట్టించడం వలన జుట్టుకి హాని కలిగించే క్రిములు తొలగిపోతాయి. జుట్టు ఎంతో బలంగా తయారవుతుంది.
- జుట్టుకి కుదుళ్ళలో రక్త ప్రసరణ వేగంగా జరగాలంటే తప్పకుండా మసాజ్ లాంటివి చేయాలి. జుట్టు లోపల వెళ్ళు ఉంచి నూనెని పోస్తూ మసాజ్ చేయడం ద్వారా జుట్టు మూలాలకి రక్త ప్రసరణ జరిగి జుట్టుకి ధృడంగా మారుతుంది. ముఖ్యంగా ఒత్తిడిని దూరంగా ఉంచాలి. ఒత్తిడి కి లోనయితే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవన్నీ వృధానే అవుతాయి.