కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవినేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ని మొదలు పెట్టారు. ఈ ఛారిటీకి ఎందరో విరాళాలను అందిస్తున్నారు. సినీ కార్మికులు లేనిదే సినిమాలు లేవనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే,కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
ఇకపోతే తాజాగా తెలుగు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండమరో సంచలన నిర్ణయానికి తెరలేపారు.. తెలంగాణలోని 1450 మందికి ఫెస్ ప్రొటెక్షన్ షీల్డ్లను పంపిణీ చేశారు..అనంతరం విజయ్ దేవరకొండమాట్లాడుతూ... మనమంతా ఇంత జాగ్రత్తగా ఉన్నామంటే కారణం పోలీసులు, డాక్టర్లే.. లాక్ డౌన్ ఉన్న బయట తిరుగుతున్న ప్రజలకు కరోనా పై అవగాహన కల్పిస్తూ రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న వీరందరి సేవలు అభినందనీయం అని కొనియాడారు..ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా పై పోరాటం చేయాలని విజయ్ దేవరకొండవ్యాఖ్యానించారు..