మామూలుగా అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్పదవీకాలం ఐదేళ్లు ఉండగా దాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ ఇటీవల ఏపీప్రభుత్వం సరికొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో వచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్వద్దకు వెళ్లగా ఆయన ఓకే చేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్పదవీకాలం ముగిసిన టైం అయింది. స్థానికఎన్నికలు ఎవరికీ చెప్పకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్వాయిదా వేయడంతో జగన్అప్పట్లో తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. అసలు ఎన్నికల వాయిదా గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా ఏ విధంగా వాయిదా వేస్తారు అని.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో గాని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో కానీ సమస్య గురించి చర్చించకుండా..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ విధంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో ప్రశ్నించారు.
ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్ర అని జగన్ఆరోపించడం జరిగింది. అయితే ఇటీవల ఒక్కసారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్పదవీకాలాన్ని తగ్గించి పదవి నుంచి తొలగించడం తో ఏపీలో ఈ వార్త సంచలనం సృష్టించింది. అధికారంలో ఉన్నవాళ్లు ఏదైనా చేయగలరు అని తాజా నిర్ణయంతో జగన్ప్రత్యర్థులకు మంచి సందేశం ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయాలు చేస్తే అధికారంలో ఉన్న నాయకులు ఎలాంటి గుణపాఠం చెబుతారు అన్నదానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది అని చాలామంది అంటున్నారు.
]]>