ఇదిలా ఉండగా పూజా హెగ్డేఇపుడు యంగ్ రెబల్ స్టార్ప్రభాస్మూవీలో స్వీట్ బ్యూటీగా జత కడుతున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడుకు ఆ మూవీలో మంచి ఇంపార్టెన్స్ ఉందిట. కేవలం ఆడిపాడడమే కాదు. అన్ని విధాలుగానూ సరిపోయే పాత్ర తనదని అంటోంది.
రాధాక్రిష్ణ డైరక్షన్లో ప్రభాస్నటిస్తున్న మూవీకి జాన్అన్న వర్కింగ్ టైటిల్ అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని యూవీ క్రియేషన్స్బ్యానర్ నిర్మిస్తోంది. కరోనా వైరస్కి ముందు షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీఇపుడు కాస్తా ఆగింది. అయితే ఈ మూవీపూర్వ జన్మలతో ముడిపడి ఉన్న కధగా ప్రచారం ఓ వైపు సాగుతోంది.
మరో వైపు ఈ మూవీకధ గురించి పూజా హెగ్డేలీకులు ఇస్తోంది. ఈ మూవీకంప్లీట్ యాక్షన్ కాదని, ఎమోషన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయని కూడా చెప్పుకొచ్చింది. ఈ మూవీలో వచ్చే క్లమాక్స్ అయితే అభిమానులను బాగా ఆకట్టుకుంటుందని కూడా పూజ అంటోంది.
ఈ మూవీలో కావాల్సినత సెంటిమెంట్ సీన్లు ఉన్నాయని, అన్ని వర్గాలను తప్పకుండా అలరించే మూవీఅవుతుందని కూడా ఈ ముద్దు గుమ్మ చెబుతోంది. మరి ఇలా మూవీకధ మీద లీకులు ఇచ్చేస్తే పూజాఎలా అంటున్నారంతా. ఏది ఏమైనా పూజా హెగ్డేరూటే సెపరేటేమో కదా.
]]>