కొత్తగా వచ్చి చేరిన ఈ 24 పాజిటివ్ కేసులను కలుపుకొని మొత్తం 405 పాజిటివ్ కేసులు గా నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పటివరకు 11 మంది డీఛార్జ్ కాగా ఆరుగురు చనిపోయారు. ప్రస్తుతానికి 385 మంది హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంత పురంలో 15 , చిత్తూరులో 20 , తూ.గో 17 , గుంటూరులో 75 , కడప 30 , కృష్ణ 35 , కర్నూల్ 82 . నెల్లూరు 42 , ప్రకాశంలో 46 . విశాఖలో 20 , ప.గో 22 అన్ని కలిపి 405 పాజిటివ్ కేసులు ఉన్నాయ్ .
ఇప్పటికే నరేంద్రమోడీవీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో సమావేశం జరిపారు . ఇందులో భాగంగా లాక్ డౌన్ పై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ముఖ్యమంత్రివై ఎస్ జగన్తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. రెడ్జోన్స్ , ఆరంజ్ జోన్స్ మరియు గ్రీన్ జోన్స్ లను తాము గుర్తించామని . రెడ్మరియు ఆరంజ్ జూన్లలోని ప్రాంతాలను లాక్ డౌన్ పొడిగిస్తూ గ్రీన్ జోన్ లను లాక్ డౌన్ ఎత్తివేయవలసిందిగా ప్రధాన మంత్రిని కోరడం జరిగింది
]]>