Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298438

ఆ సినిమాతో పడ్డారు.. ఈ సినిమాతో లేస్తారా..!

$
0
0
హీరోహీరోయిన్కలిసి సినిమాచేస్తే ఆ మూవీహిట్ అయితే వాళ్ళ జోడికి మంచి క్రేజ్ ఉంటుంది. అయితే జంట బాగుండి సినిమాప్లాప్ అయితే మాత్రం మళ్ళీ ఆ ఇద్దరు కలిసి చేస్తే అదే నెగటివ్ సెంటిమెంట్ తో చూస్తారు. అయితే ఈ సెంటిమెంట్ కు బ్రేక్ వేయాలని చూస్తున్నారు ఒక యువజంట.  యువహీరోశర్వానంద్, క్రేజీ హీరోయిన్సాయి పల్లవికలిసి ఇంతకుముందు పడి పడి లేచే మనసు సినిమాచేశారు. హను రాఘవపూడిడైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇద్దరి జోడీ బాగుందని అనిపించినా సినిమావర్క్ అవుట్ అవలేదు.

అయితే మరోసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్భూపతి డైరెక్షన్ లో మహాసముద్రం సినిమాలోశర్వానంద్, సాయి పల్లవినటిస్తున్నారని తెలుస్తుంది. నాగ చైతన్య, సమంతచేయాల్సిన ఈ సినిమాచివరి నిమిషంలో వాళ్ళు తప్పుకోవడంతోశర్వానంద్చేతికి వచ్చింది. చైతు చేయకపోవడంతో సమంతకూడా సినిమానుండి తప్పుకుంది. ఫైనల్ గా ఆ సినిమాలో శర్వా, సాయి పల్లవిజోడి ఫిక్స్ అయ్యింది. 



పడి పడి లేచే మనసు సినిమాప్లాప్ అయినా కూడా ఈ ఇద్దరు  మళ్ళీ జోడి కడుతున్న ఈ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. మహాసముద్రం దాదాపు రెండేళ్లుగా కథ పట్టుకుని హీరోల చుట్టూ తిరిగిన అజయ్భూపతి సినిమాతీసి హిట్టు కొట్టి తన కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. పడి పడి లేచే మనసు, జాను వరుస ప్లాపుల్లో ఉన్నశర్వానంద్కు ఈ సినిమాహిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. మరి శర్వాతో అజయ్భూపతి ఎలాంటి సినిమాచేస్తాడో చూడాలి. శర్వా సాయి పల్లవిఆ సినిమాతో పడ్డారు ఈ సినిమాతో లేస్తారేమో చూడాలి. 

]]>

Viewing all articles
Browse latest Browse all 298438

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>