Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298571

ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో పోలీస్ రోల్ లో కనిపించనున్నాడా ...?

$
0
0
బాహుబలిసినిమాతర్వాత ప్రభాస్రేంజ్ బాగా పెరిగింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవ౦. ప్రభాస్తో సినిమాచేయడానికి అప్పటి నుంచి కూడా ఎందరో దర్శకులు పోటీ పడుతూ వచ్చారు. ఆయన కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేయడం, అగ్ర దర్శకులే అనే కాకుండా సినిమాకు మంచి రేంజ్ ఉంటే సినిమాను చేయడం వంటివి చేస్తున్నాడు. బాహుబలితర్వాత ప్రభాస్చేసిన సినిమాసాహో. ఈ సినిమాఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమామీద ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా సరే అంచనాలను ఈ సినిమాఅందుకోలేదు. 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్జిల్ఫేం రాధాకృష్ణదర్శకత్వంలో ఒక సినిమాచేస్తున్నాడు. ఈ సినిమాషూటింగ్ కాస్త పూర్తి కాగా సినిమాను వాయిదా వేసారు. కరోనా వైరస్కారణంగా ఈ సినిమావాయిదా అపడింది. సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకూడా భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలెవల్ లో ఈ సినిమాను ప్లాన్ చేసారు. మరి ఏమైందో ఏమో మళ్ళీ ఈ సినిమాను తెలుగుకు మాత్రమే పరిమితం చేసారు. ఇక ఈ సినిమాతర్వాత అతను ఏ సినిమాచేస్తాడు అనేది స్పష్టత లేదు. 



ఒక కథ రెడీ గా ఉందని అందులో ప్రభాస్పోలీస్అధికారిగా నటించే అవకాశం ఉందని సమాచారం. కథ బాగా నచ్చడం తో ఆ సినిమాను ఒప్పుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాసెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కథ బాగా నచ్చడం తోనే ప్రభాస్కూడా ఈ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్స్టార్ హీరోయిన్దీపికపదుకొనే నటించే అవకాశాలు ఉన్నాయి.

]]>

Viewing all articles
Browse latest Browse all 298571

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>