మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ అని తేలడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అకోలా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం అసోం నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. నిజానికి ఈ నెల ఏడో తేదీనే కరోనా అనుమానిత లక్షణాలతో ఆ వ్యక్తిని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో జాయిన్ చేశారు. శుక్రవారం కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున బాత్రూమ్‌లో గొంతుకోసుకుని సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తనది అసోంలోని నాగన్ జిల్లాఅని సమాచారం. మరోవైపు అకోలా జిల్లాలో ఇప్పటివరకు 13 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇందులో ఏడు కేసులు అకోలా నగరానికి చెందినవే. తాజాగా శుక్రవారం ముగ్గురు కరోనా పాజిటివ్‌గా తేలగా.. అందులో అసోంకు చెందిన వ్యక్తి ఒకరు కావడం గమనార్హం.
ఇక కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్రచిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటివరకు 1500కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 110 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు ఎనిమిది వేల కరోనా పాజిటివ్ వెలుగు చూశాయి. 240 మందికిపైగా మరణించారు. తాజాగా ఈనెల 30 వరకు ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించారు.
]]>