రెండు వారాల పాటు ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ పాటించాలని చెప్పిన కేసీఆర్కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇక కంటైన్‌మెంట్ జోన్లలో నిత్యావసరాలు ఇప్పటికే డోర్ డెలీవరి చేస్తున్నామని అన్న కేసీఆర్కేంద్ర, రాష్ట్రాలు ఏకతాటిపై నిలిచి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కేసీఆర్చెప్పారు. ఇక వ్యవసాయ రంగంలో లాక్‌డౌన్ లేదన్న ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మాత్రం అనుమతి ఇస్తున్నామన్నారు. ఓవరాల్‌గా రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు.
అదే టైంలో మీడియావాళ్లు అడిగిన ప్రశ్నలకు బదులు ఇస్తూ ఈ టైంలో ఎవరు అయితే తినుబండరాలు, నూనెలను కల్తీ చేసి అమ్ముతారో వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎవరైతే అనుకూలంగా వాడుకుని ఇలాంటి కల్తీలకు పాల్పడతారో వారిపై రెండు లేదా మూడు నెలల్లో చర్యలు తీసుకుంటామని.. వారిపై పీడీ యాక్టు పెట్టి లోపలేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి తెలంగాణలో ఎవరైనా ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడితే వారికి శంకరగిరి మాన్యాలు.. జైలు ఊచలే గతి.
]]>