లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో వైన్ షాపులు ఎట్టిపరిస్థితుల్లో తెరిచే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మరో ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం ముందుకెళ్లబోదని కుండ బద్దలు కొట్టారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.
లాక్‌డౌన్ తో వైన్స్‌లు, బార్లు మూతబడ్డాయి. దీంతో మందు దొరక్క మందుబాబులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కల్లుకూడా దొరక్క గ్రామాల్లో పలువురు వింతగా ప్రవర్తిస్తున్నారు. కొంత మం ది ఏకంగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. మరి కొందరు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరావడం లేదు. ఇలాంటి వారితో ఎర్రగడ్డ మానసిక దవాఖానలో కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతుంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికేసీఆర్చేసిన ప్రకటన మందు బాబులకు మింగుడు పడటంలేదు. లాక్‌డౌన్ పొడిగించినా, వైన్స్‌లు, బార్‌లకు కాస్త మినహాయింపు దొరకుతుందని బావించిన వారి ఆశలు కాస్తా ఆవిరయ్యాయి.
]]>