తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న16 కేసులు నమోదు కాగా ఈ రోజు కూడా మరో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 503 కు చేరింది. మరణాల విషయానికి వస్తే ఈ రోజు ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందడంతో కరోనా మరణాల సంఖ్య 14 కు చేరింది. కాగా 96మంది కోలుకోగా ప్రస్తుతం 393 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖహెల్త్బులిటెన్ విడుదలచేసింది. రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత తగ్గనుంది.
Media Bulletin : Status Update of #COVID19 positive cases in Telangana. ( Dated : 11/04/2020 ) pic.twitter.com/BsCA4xFyKp
— Eatala rajender (@Eatala_Rajender) April 11, 2020
ఇదిలావుంటే కొద్దీ సేపటి క్రితం ప్రెస్మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్ఈనెల 30వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం కూడా లాక్ డౌన్ పొడిగించడానికే మొగ్గు చూపుతుందని త్వరలోనే ఆ విషయాన్ని ప్రకటిస్తుందని అన్నారు. ఇక తెలంగాణతో కలిపి ఇప్పటివరకు మూడు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. అందులో భాగంగా ఒడిశామొదట గా లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లుగా ప్రకటించగా ఆతరువాత పంజాబ్కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. ఇక తెలంగాణలో కేసులు సంఖ్య తగ్గుతున్నా దేశ వ్యాప్తంగా రోజు రోజు కు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా లాక్ డౌన్ ను పొడింగించామని కేసీఆర్అన్నారు. అలాగే ఈనెల 30 తరువాత పరిస్థితిని బట్టి లాక్ డౌన్ ను దశల వారిగా ఎత్తివేస్తామని సీఎం వెల్లడించారు.
]]>