ఇక ప్రస్తుతం మిస్ ఇండియాఅనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది కీర్తి. ఇకపోతే గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్పెళ్లిపై రకరకాల వార్తలు ప్రచారం అవుతూ అందరిలోనూ పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ముందుగా ఒక బీజేపీజాతీయ నాయకుడి కుమారుడితో ఆమె వివాహం నిశ్చయమైందని ఒక వార్త ప్రచారం అయింది, ఆ తర్వాత ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తతో ఆమె వివాహం ఆల్మోస్ట్ కుదిరినట్లు మరొక వార్త ప్రచారం అయింది, అలానే ఒక కోలీవుడ్యంగ్ హీరోతో ఆమె ప్రేమలో ఉన్నారని, అతి త్వరలో అతనిని వివాహం చేసుకోబోతున్నారని కూడా వార్తలు రావడం జరిగింది.
ఇక ఇటీవల ఏకంగా కోలీవుడ్ కమెడియన్ అయిన సతీష్తో ఆమె వివాహం జరిగిపోయింది అంటూ ఒక సంచలన వార్త ప్రచారమైంది. ఈ విధంగా కీర్తి సురేష్వివాహం జరగబోతుంది, జరిగిందంటూ రోజుకొకరి పేర్లు బయటికి వస్తుండటంతో ఆమె అభిమానులు విపరీతంగా అనాసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కీర్తిమాట్లాడుతూ, తనకు వివాహం కుదిరితే తప్పకుండా మీడియాకు, ప్రజలకు తెలియ పరుస్తాను అని చెప్పటం జరిగిందని, అలాంటప్పుడు రకరకాలుగా ఎవరెవరితోనో ఆమె పెళ్ళి నిశ్చయమైందని అంటూ ఈ విధంగా రకరకాలుగా తప్పుడు కథనాలు ప్రసారం చేయటం కరెక్ట్ కాదని ఆమె అభిమానులు అంటున్నారు......!!
]]>