Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 311201

పనిమనిషి అంత్య క్రియలు చేసి మానవత్వం చాటుకున్న గౌతమ్ గంభీర్ ...!

$
0
0
టీమిండియా మాజీ క్రికెటర్, ఢిల్లీఎంపీగౌతమ్గంభీర్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. గంభీర్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న సరస్వతి అనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే... గత ఆరు సంవత్సరాల పాటు గౌతం గంభీర్ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఆమె కొన్నిరోజులుగా మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధితో ఇబ్బందులు పడుతున్నది. దీనితో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించడం జరిగింది. 


అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆమె మృతదేహాన్ని ఒడిషాలో నివసిస్తున్న వాళ్ళ కుటుంబం కుటుంబానికి పంప లేని పరిస్థితి ఏర్పడింది. దీనితో స్వయంగా గౌతం గంభీరే అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియావేదికగా చేసుకొని ట్వీట్ చేయడం జరిగింది. ఇక ట్వీట్ లో నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పుడూ పని మనిషి కాదు ఆమె నా కుటుంబ సభ్యురాలు.. ఆమె అంతక్రియలు చేయడం నా బాధ్యత.. అందర్నీ గౌరవించాలి అనేది నా సిద్ధాంతం. ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి ఇదే ముఖ్యమైన మార్గం అంటూ ట్వీట్ చేయడం జరిగింది.




ఇక ఈ విషయంలో మంచి తత్వాన్ని చాటుకున్న గౌతం గంభీర్ ను కేంద్ర ప్రభుత్వపెట్రోలియం శాఖ మంత్రిధర్మేంద్రప్రధాన్ అభినందించడం జరిగింది. ఇక ట్వీట్ కు స్పందిస్తూ మంత్రిఅనారోగ్యంతో బాధపడుతున్న సరస్వతిని గౌతం గంభీర్ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆమె మృతదేహాన్ని ఒడిస్సాకి పంపలేని పరిస్థితిలో ఆయనే స్వయంగా అంత్యక్రియలు చేసాడు. అంతేకాకుండా జీవన ఉపాధి కోసం సొంత ఊర్లో వదిలేసి చాలా మంది పేదలకు ఇది ఒక మానవత్వం పై విశ్వాసం పెంచుతుంది అని మంత్రిట్వీట్ లో తెలియజేయడం జరిగింది. ఇక ఒడిషాలోని రాంపూర్ జిల్లాలోని ఒక గ్రామానికి సరస్వతి చెందినదిగా స్థానికమీడియావెల్లడించింది.

]]>

Viewing all articles
Browse latest Browse all 311201

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>