Quantcast
Viewing latest article 21
Browse Latest Browse All 308685

టివి: కమిట్మెంట్ ఒప్పుకుంటే ఎన్నో బంగ్లాలు..సీరియల్ నటి కీర్తి భట్ కామెంట్స్..!

కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి క్రేజీ సంపాదించకున్న నటి కీర్తిభట్ గురించి చెప్పాల్సిన పని లేదు.. ఆ తర్వాత భారీ క్రేజ్ రావడంతో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె కుటుంబ సభ్యులకు కూడా ఒక యాక్సిడెంట్లో మరణించడంతో అనాధగా మిగిలిపోయింది. కీర్తిభట్ యాక్సిడెంట్కి గురి కావడం వల్ల ఈమె గర్భసంచిని కూడా తీసేశారు.. దీంతో ఈమెకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదట. ఈమె ప్రియుడు కూడా ఈమె పై అనుమానం పెంచుకొని మరి ఇమెను చాలా ఇబ్బంది పెట్టే వారట.



అందుకే ఈమె ఒక చిన్నారిని దత్తకు తీసుకొని మరి పెంచుకుంటూ ఆనందంగా జీవిస్తున్న సమయంలో ఆ చిన్నారి కూడా మరణించిందట. అయినప్పటికీ కూడా ఒంటరిగా తన జీవితాన్ని ఎదురీత ఈదుతూ తనకు నచ్చిన రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వస్తోంది. గతాన్ని వదిలేసి మరి కొత్త జీవితాన్ని ముందుకు వేయాలని సిద్ధమవుతోంది. తన స్నేహితుడు విజయ్కార్తికేయన్ తో కీర్తిభట్ ఎంగేజ్మెంట్ 2023 ఆగస్టున జరిగింది. హౌస్లో ఉన్నప్పుడు తన బ్రేకప్ లవ్ స్టోరీని కూడా చెప్పి అందరిని ఎమోషనల్ గా ఆకట్టుకుంది.


కానీ తనని వదిలేసిన వ్యక్తిని కూడా ఎప్పుడు నెగిటివ్గా చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు తనని బ్యాడ్ చేస్తున్నారంటూ ఎమోషనల్ గా మాట్లాడుతోంది కీర్తిభట్. అయితే తన బాయ్ ఫ్రెండ్ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అని అతని బండారాన్ని బయటపెడుతూ పలు విషయాలను తెలియజేసింది.. కీర్తిభట్ మాట్లాడుతూ తాను విలువలతో కూడిన జీవితాన్ని బ్రతకాలనుకుంటున్నానని అడ్డదారిలో సంపాదించాలనుకుంటే ఇలా తన దగ్గర ఏమీ లేని దానిలా ఉండేదాన్ని కాదు అంటూ తెలియజేసింది.. నాకు కూడా ఒక మంచి లైఫ్ ఉంది అందుకే ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదని.. ఇలాంటి విషయాలలో తాను రఫ్ గానే ఉంటానని ఈ విషయం ఇండస్ట్రీలో ఉండే చాలా మందికి తెలుసు కాబట్టి.. డైరెక్టర్లు ఎంత పెద్ద అవకాశం ఇచ్చారు.. అలాంటి నీచమైన పనిని చేయనని తెలిపింది.. ఒకవేళ తాను అలాంటి పని చేసి ఉంటే ఈపాటికి పెద్ద పెద్ద బంగ్లాలు ఉండేవి అంటూ వెల్లడించింది.. ప్రస్తుతం తనకు ఇల్లు కూడా లేదని వెల్లడించింది..మా నాన్నఎప్పుడూ కూడా నీతిగానే బతకమని చెప్పారు.. కష్టపడి సంపాదించింది మన దగ్గరే ఉంటుంది.. అడ్డదారులలో సంపాదించింది ఉండదు అంటు ..అది పేరు అయినా డబ్బు అయినా అంటూ తెలిపారనీ తెలిపింది. అదే ఫాలో అవుతున్నారని తెలిపింది.
]]>

Viewing latest article 21
Browse Latest Browse All 308685

Trending Articles