Quantcast
Viewing latest article 27
Browse Latest Browse All 308635

హిట్ కి అత్యంత దగ్గరగా వీర ధీర శూర.. ఇంకా అంతా వస్తే చాలు..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కళ్యాణ్నటులలో ఒకరు అయినటువంటి విక్రమ్గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్రమ్ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకొని తమిళసినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇప్పటి వరకు విక్రమ్నటించిన చాలా సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలతో విక్రమ్కి టాలీవుడ్బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు దక్కడంతో టాలీవుడ్ఇండస్ట్రీలో కూడా విక్రమ్కి మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే విక్రమ్"వీర ధిర శుర"అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమామార్చి 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాల నడుమ విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి లభించింది. ఈ మూవీకి మంచి టాక్ వచ్చినా కూడా ఈ మూవీఅద్భుతమైన కలెక్షన్లను  బాక్సా ఫీస్ దగ్గర రాబట్టడంలో కాస్త విఫలం అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 10 రోజుల బాక్స్ ఆఫీస్రన్ కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

10 రోజుల్లో ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 34.15 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి  2.40 కోట్లు , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 3.40 కోట్లు , ఓవర్ సీస్ లో 15.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 26.80 కోట్ల షేర్ ... 55.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీవరల్డ్ వైడ్ 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీమరో 10 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.
]]>

Viewing latest article 27
Browse Latest Browse All 308635

Trending Articles