Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297354

టాలీవుడ్ హీరోల పరువుతీస్తున్న కరోన !

$
0
0
దేశం యావత్తు లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో ఎవరికి వారు స్వీయ గృహ నిర్భందంలో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడటంతో ప్రజలు టివి లకు సెల్ ఫోన్స్ కు అతుక్కుపోయి ఎదోవిధంగా రోజుగడుపుతూ ఈలాక్ డౌన్ నుంచి ఎప్పుడు విడుదల అవుతామా అంటూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ లాక్ డౌన్ ఇలా కొనసాగుతూ ఉండగానే ఈలాక్ డౌన్ వల్ల టాప్ హీరోల అభిమానుల మధ్య చిచ్చురేగడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.


సినిమాలు లేకపోవడంతో ఎంతో ఖాళీగా ఉన్న చాలామంది టాప్ హీరోల అభిమానులు తమ హీరోల పాత సినిమాలకు సోషల్ మీడియాలో ఉత్సవాలు చేయడం ఒక హాబీగా పెట్టుకున్నారు. పవన్కళ్యాణ్నటించిన ‘జల్సా’ మూవీఏప్రిల్ 2న 2008 విడుదలైన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ పవన్వీరాభిమానులు ఈమధ్య ‘జల్సా’ విడుదలై 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి పవర్ స్టార్గొప్పతనాన్ని వివరిస్తూ గత కొద్దిరోజులుగా తెగ హడావిడి చేస్తున్నారు. 



ఈమధ్య అల్లు అర్జున్ఇండస్ట్రీలోకి వచ్చి 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బన్నీఅభిమానులు తమ హీరోపై రకరకాల పోష్టర్లు డిజైన్ చేసి ‘అల వైకుంఠపురములో’ రికార్డులను హైలెట్ చేస్తూ హడావిడి చేసారు. ఈలోపున ఉగాది సందర్భంగా మహేష్‘సరిలేరు నీకెవ్వరు’ బుల్లితెర పై ప్రసారమై టిఆర్ పి రేటింగ్స్ విషయంలో ‘బాహుబలి 2’ టి ఆర్ పి రేటింగ్స్ ను క్రాస్ చేయడంతో మహేష్అభిమానులు రెచ్చిపోయి ‘అల’ రికార్డులు ‘సరిలేరు’ ముందు నిలబడలేకపోయాయి అంటూ బన్నీఅభిమానులను మహేష్అభిమానులు టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.



అంతేకాదు మహేష్నటించిన ఒకనాటి బ్లాక్ బష్టర్ మూవీ‘పోకిరి’ 28 ఏప్రిల్ 2006 విడుదలై ఈఏప్రిల్ తో 14 సంవత్సరాలు అయిన సందర్భంగా తమ హీరో‘పోకిరి’ మూవీలా 100 సెంటర్లలో 100 రోజులు ఆడిన సినిమాఏ హీరోకి ఉంది అంటూ మరొక సరికొత్త ప్రచారానికి తెర తీసారు. ఈ విషయాలు అన్నీ పరిశీలిస్తున్న జూనియర్అభిమానులు ఈ కామెంట్స్ వార్లో తాము కూడ ఉన్నాము ఎన్టీఆర్నటించిన ‘శక్తి’ సినిమావిడుదలై ఈనెలతో 9 సంవత్సరాలు అయింది అంటూ పోస్టర్ఒకటి డిజైన్ చేసి సోషల్ మీడియాలో ‘9 ఇయర్స్ ఫర్ శక్తి’ అంటూ పోస్ట్ చేశారు. ఆసినిమా ఎంత ఫ్లాప్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆసినిమా జూనియర్కు ఒక పీడకల. అలాంటి సినిమాను మళ్ళీ జూనియర్కు గుర్తు చేస్తూ హడావిడి చేయడం ఒక విధంగా జూనియర్ను చులకన చేయడమే అంటున్నారు.
కరోనా తో ఖాళీ సమయం పెరిగిపోతూ ఉండటంతో సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని తమ హీరోగురించి ట్రెండ్ చేయాలనే ఉద్దేశ్యంతో హీరోల వీరాభిమానులు చేస్తున్న హడావిడి ఒక విధంగా టాప్ హీరోల పరువు తీస్తోంది అంటూ కొందరు ఈ వికృత ధోరణి పై తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు..  

]]>

Viewing all articles
Browse latest Browse all 297354

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>