అలానే ఫోన్లో గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటివి కూడా లభిస్తుండడంతో సెలెబ్రిటీల దగ్గరి నుండి సామాన్యులు వరకు అందరూ తమకు సంబందించిన సమాచారాన్ని వాటిలో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తున్నారు. ఇక ఒకప్పటితో పోలిస్తే ఇటీవల కాలంలో మనలో దాదాపుగా చాలామంది యూట్యూబ్మీద పడ్డారు. చేతిలో ఒక సెల్ ఫోన్, బుర్రలో కొద్దిపాటి టాలెంట్ ఉంటే చాలు తమకు తోచిన విధంగా ఒక యూట్యూబ్ఛానల్ క్రియేట్ చేసి వాటిలో రకరకాల వీడియోలు షూట్ చేసి పోస్ట్ చేయడం, వాటి ద్వారా బాగా వ్యూస్, లైక్స్ లభించినట్లైతే తద్వారా యూట్యూబ్నుండి ఆదాయం కూడా బాగానే పొందుతున్నారు.
ఇక ఈ విధంగా ఇటీవల పలువురు సెలెబ్రిటీలు సైతం యూట్యూబ్ఛానల్స్ ని స్టార్ట్ చేసి ఓవైపు పేరుతో పాటు మరోవైపు చక్కగా ఆదాయాన్ని ఆర్జించడం పరిపాటి అయిపోయింది. ఇకపోతే నేడు బన్నీతో కలిసి నటించిన దేశముదురు సినిమాతో టాలీవుడ్కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హన్సికమోత్వానీ, నేడు సొంతంగా తన పేరుమీద యూట్యూబ్ఛానల్ ని స్టార్ట్ చేసి, తన సోషల్ మీడియాఅకౌంట్స్ లో పోస్ట్ చేసింది. మీ అందరి ఆదరణ నాకు కావాలి, తప్పకుండా నా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి అంటూ ఆమె తన అభిమానులను కోరడం జరిగింది.....!!
]]>Super excited and a little nervous to share with you all that I’ve finally launched my youtube channel. So get ready to go on a crazy ride with me and get an insight into my life and the real me. Make sure you like share and subscribe 😉 https://t.co/dbNLBqPcECpic.twitter.com/n4Tg0j7eEF
— Hansika (@ihansika) April 6, 2020