దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతోంది. ఇప్పటివరకు 4757 కేసులు నమోదు అయ్యాయి. 132మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా
కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా
96జిల్లాలను కరోనా రెడ్‌జోన్లలో చేర్చాయి. ఇందులో ఏపీలోని ఏడు జిల్లాలు ఉన్నాయి. ప్రధానంగా కర్నూలులో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణలో కొంతమేరకు పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ.. ఏపీలో మాత్రం పరిస్థితి కొంత ఆందోళనకరంగానే కనిపిస్తోంది.
కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య 303కు చేరింది.
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే కరోనా కట్టడికి లాక్‌డౌన్ కొనసాగించాల్సిందేనని తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్అన్నారు. లాక్‌డౌన్ కట్టడికి మన దగ్గర ఉన్న ఏకైన ఆయుధం లాక్‌డౌన్ పాటించడమేనని ఆయన చెప్పారు. ఇదే బాటలో ఏపీముఖ్యమంత్రి జగన్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే.. లాక్‌డౌన్ కొనసాగినంతకాలం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం కష్టమే. ఇదిలా ఉంటే.. ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తేసినా కూడా పాఠశాలల మాత్రం కనిపించడం లేదు. పాఠశాలలు తెరిస్తే విద్యార్థులు గుమిగూడే ప్రమాదం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలను మూసి ఉంచడమే మేలనే నిర్ణయాలు ప్రభుత్వాలు వస్తున్నాయి. అంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తేసినా.. సడలించినా.. విద్యాసంస్థలు మాత్రం తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు.
]]>