నిబంధనలు ఉల్లంఘించిన 1410 మందిని అరెస్ట్చేశామని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్దేశ్‌ముఖ్ వెల్లడించారు. తాజాగా ఓ వ్యక్తి లాక్ డౌన్ ఉల్లంఘించడం మాత్రమే కాదు ప్రస్తుతానికి నిషేదించిన మద్యాన్ని కూడా తనదైన ప్లానింగ్ తో సరఫరా చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. బులంద్‌షహర్‌కు చెందిన బాబీచౌదరీ వృత్తిరీత్యా పాల వ్యాపారి. తన బంధువు పుట్టినరోజు సందర్భంగా మద్యం తీసుకెళ్లాలని అనుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా మద్యాన్ని దొంగతనంగా తీసుకువెళ్లాలని.. అందుకు తన పాల డబ్బాలనే అనువుగా భావించాడు. వాటిలో తీసుకువెళ్తే ఎవరికీ అనుమానం రాదు అనుకున్నాడు.
ఏడు మద్యం సీసాలను పాల డబ్బాల్లో దాచి తీసుకు వెళ్తున్నాడు. సౌత్ ఎవెన్యూ రహదారి పికెట్ వద్ద పోలీసులు బాబీని చూశారు. ఇంత రాత్రి వేల పాల డబ్బాలు ఏంటీ అని అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు. బాబీమాత్రం అస్సలు ఆగకుండా బండి వేగం పెంచాడు. పోలీసులు అతడిని చాలాదూరం వరకు వెంబడించి, రాష్ట్రపతి భవన్ నాలుగో ద్వారం వద్ద పట్టుకున్నారు. అతడిపై అంటువ్యాధుల చట్టం, ఢిల్లీఎక్సైజ్ చట్టం, ఐపీసీ, వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>