అయితే కరోనాకేసు తీవ్రతను బట్టి ఈ ప్యాకేజీ మారుతుందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ఆ శాఖ ప్రకటించింది. కాగా, ఎపిడెమిక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ యాక్ట్ కింద ఏపీలో 500 ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఉత్తర్వుల ప్రకారం ఇకపై కరోనావైరస్ లక్షణాలున్న అనుమానితులకు వైద్యమందిస్తే 10,774 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. అంతే కాకుండా వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ కింద మరో 5,631 రూపాయలు చెల్లించనున్నారు. కరోనాలక్షణాలకు వైద్యమందిస్తే ఒక పేషెంట్‌కు 16,405 రూపాయలు చెల్లించనున్నారు.
ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే సోమవారం రాత్రి విడుదల చేసిన బులిటెన్ల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 303పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో 367మంది కరోనా వైరస్ బారినపడ్డట్లు అధికారులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో మర్కజ్ మూలాలతోనే కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతుండటం గమనార్హం. తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. నో మూవ్‌మెంట్ జోన్లుగా ప్రకటించి ఇంటింటికీ ఆరోగ్య బృందాలను పంపి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక ఏపీప్రభుత్వం కూడా ఇప్పటికే ఆ పనిని చేపట్టింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>