కరోనా... అగ్ర రాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తుంది. దీని దెబ్బకు ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనాకేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ముఖ్యంగా దీని ప్రభావం ఆర్ధిక రాజధానిన్యూయార్క్లో ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో న్యూయార్క్లో 731 కరోనామరణాలు సంభవించాయని గవర్నర్ఆండ్రూ క్యూయోమో వెల్లడించాడు. దాంతో న్యూయార్క్లో కరోనామరణాల సంఖ్య 6159 కుచేరింది. ఇక ఓవరాల్ గా కరోనావల్ల అమెరికాలో లక్షకు పైగా మరణిస్తారని అక్కడి మెడికల్ అడ్వైసరి అంచనా వేసింది. కరోనాకట్టడి విషయంలో దేశ అధ్యక్షుడు ట్రంప్ఉదాసీనతగా వ్యవహరించడం తో ఇప్పుడు కరోనాఅక్కడ విలయతాండవం చేస్తుంది. ఇంత జరుగుతున్న కూడా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను విధించకపోవడం గమనార్హం.
ఇక చైనాలో మొదటి సారి కరోనామరణం లేని రోజు నమోదైయింది. ఈ వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణికిన ఇటలీలో ఇప్పుడే ఇప్పుడే కేసుల సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది దాంతో మే 4 నుండి లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. స్పెయిన్లోకూడా కరోనా కొంత మేరకు శాంతించింది. ఇక ఇండియాలో మాత్రం రోజు రోజుకి కరోనాకేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనాకేసుల సంఖ్య 5000 దాటింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలవుతుంది. ఈనెల 14 తో ఈ లాక్ డౌన్ ముగియనుంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండడం తో లాక్ డౌన్ ను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని కేంద్రం భావిస్తుంది.
]]>