Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297352

ఏపీలో ఢిల్లీ క‌రోనా క‌ల‌క‌లం....బొత్స కీల‌క వ్యాఖ్య‌లు

$
0
0
ఏపీలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి గురించి, రాష్ట్రంలోని ప‌రిస్థితుల గురించి వైసీపీసీనియ‌ర్ నేత‌, పుర‌పాల‌క శాఖ మంత్రిబొత్సా స‌త్య‌నారాయ‌ణ ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి జ‌ర‌గ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ``విదేశాల నుంచి వచ్చిన వారిని వారి కుటుంబాల వారితో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కర్ని పరిశీలించాం. అవసరమైతే క్వారంటైన్ చేశాం. పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నాం. `` అని తెలిపారు.


ఢిల్లీ సదస్సులో పాల్గొని వచ్చిన వారి ద్వారా వ్యాప్తి చెందుతుందనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని మంత్రిబొత్సవ్యాఖ్యానించారు. వారి బంధువులు,స్నేహితులు,వారు కలిసిన వ్యక్తులను అందరికి కూడా పరీక్షలు చేశామ‌ని తెలిపారు. ``అవసరమైన వారిని క్వారంటైన్ లో పెట్టాం. 3,500 మందికి పైగా టెస్టులు జరిపాం. అందులో 304 మేర పాజిటివ్ వచ్చాయి. పాజిటివ్‌లుగా గుర్తించిన వారితో కలసిన వారు... మార్కెట్లలో కలిశారా ...ఇతర ప్రాంతాలలో కలిశారా అనేది కూడా పరిశీలన చేస్తున్నాం.` అని తెలిపారు.



`రాష్ర్టంలో ఈ కరోనావ్యాధి ఐడెంటిటి చేసేనాటికి రోజుకు 90 మందికి మాత్రమే టెస్ట్ లు చేసే అవకాశం ఉండేది.అలాంటిది ఈరోజు మనం రోజుకు 1170 మందికి టెస్ట్ లు చేసే సామర్ద్యాన్ని పెంచుకున్నాం. ఏడు ప్రాంతాలలో వైరాలజి ల్యాబ్ లు పెట్టాం.షుమారు 3,374 మందికి టెస్ట్ లు చేస్తే 3270 నెగిటివ్ గా వచ్చాయి 304 పాజిటివ్ వచ్చాయి.విదేశీ కాంటాక్ట్ లు 15 శాతం మాత్రమే వచ్చాయి. మిగిలినవి అన్నీ కూడా డిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చినవిగా తేలాయి.ఏ ప్రాంతంలో పాజిటివ్ కేసులు వచ్చాయో ఆ ప్రాంతంలో డోర్ టు డోర్ సర్వేచేయించి ప్రత్యేక జోన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాలలో అవసరమైనవ అనుమానితులందరికి టెస్ట్ లు చేసి అవసరమైతే క్వారంటైన్ చేశాం.లాక్ డౌన్ ప్రకటించినప్పటినుంచి జిల్లానుంచి జిల్లాకు వెళ్లడం పై కూడా నిబంధనలు పాటిస్తున్నాం.ప్రజలు కూడా ఇబ్బంది అయినా కూడా సహకరిస్తున్నారు.`` అని బొత్సస్ప‌ష్టం చేశారు.


]]>

Viewing all articles
Browse latest Browse all 297352

Trending Articles