ఇప్పుడు ఎక్కడ విన్న ఒకే మాట కరోనా.. అంటువ్యాధిలా వ్యాపిస్తున్న ఈ కరోనాప్రభావం రోజు రోజు పెరుగుతూ వస్తుంది. ఈ మహమ్మారిని నివారించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకొస్తున్న కూడా ఉపద్రువంలా ముంచుకొస్తుంది. ప్రపంచ దేశాలను గడ గడ లాడిస్తూ వస్తున్నా ఈ కరోనాప్రభావం భారత దేశం పై పంజావిసురుతుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే 250 మందికి పైగా కరోనాపాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే లాక్ డౌన్ ని విధించిన ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యి తమని తాము ఎలా కాపాడుకోవాలి అని సూచిస్తుంది. ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఇందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనాప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనాముంచుకొస్తుంది.
ఇకపోతే కరోనానుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనాపై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చచేస్తున్నారు. ఇక అభిమానులు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు.
ఇకపోతే నేటి సాయంత్రానికి ఏపీలో కరోనాపాజిటివ్ కేసుల బాధితుల సంఖ్య 314కి చేరింది. తాజాగా, గుంటూరు జిల్లాలో 8 కేసులు తేలగా, కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా లెక్కకు మిక్కిలిగా కరోనాకేసులు బయటపడుతుండడంతో ఉక్కిరిబిక్కిరైన ఏపీప్రభుత్వానికి ఇవాళ్టి కేసుల సంఖ్య ఊరటనిచ్చే పరిణామం అని చెప్పాలి. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో నలుగురు మరణించారు. పలు జిల్లాల్లో కరోనాపాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.