ప్రస్తుతం తెలంగాణలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనారోగుల సంఖ్య 348 మంది ఉన్నారు. ఇప్పటి వరకూ కరోనాతో తెలంగాణలో 11 మంది వరకూ చనిపోయారు. మిగిలిన వారు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వాస్తవానికి ఈ మర్కజ్ వెళ్లొచ్చిన పాజిటివ్ కేసులు లేకుండా తెలంగాణలో ఇప్పటికే కరోనాకాస్త కంట్రోల్ లో ఉండేదని భావిస్తున్నారు. ఇప్పుడు పాజిటివ్ గా తేలిన కేసుల్లో ఎక్కువగా మర్కజ్ వెళ్లొచ్చిన వారే ఉన్నారు.
సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటి వరకూ తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగిన దాఖలాలు లేవు. ఈ కరోనాగురించి ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య సీఎస్ అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొత్త కేసులు గురించి కరోనాకట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.
ఇక జిల్లాల వారీ సమాచారంచూస్తే.. హైదరాబాద్ 150 పాజిటివ్ కేసులతో నెంబర్ వన్ ప్లేసులో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ , వరంగల్ అర్బన్ ఉన్నాయి. జోగులాంబ గద్వాల , మేడ్చల్ మల్కాజ్ గిరి , ఆదిలాబాద్ జిల్లాల్లోనూ కరోనాతాకిడి ఎక్కువగానే ఉంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple
]]>