ప్రాథమిక దశలోనే విదేశీయులను పకడ్బందీగా క్వారంటైన్ చేసి ఉంటే, ఇప్పుడు నెలల తరబడి లాక్ డౌన్ ప్రకటించాల్సిన దుస్థితి తలెత్తి ఉండేది కాదు . ఒకదశలో విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేయడం ద్వారా , కరోనాకట్టడి అవుతుందని అందరూ భావించారు . అంతలోనే నిజాముద్దీన్ మర్కజ్ మసీదు లో తబ్లీగి జమాత్ మతసమ్మేళనం లో పాల్గొన్న వారి వల్ల , కరోనాదేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తృతి చెందుతోంది . ఒకవైపు లాక్ డౌన్ నిబంధనలు అమలు లో ఉండగా మతసమ్మేళనం నిర్వహించరాదన్న ఇంగితాన్ని నిర్వాహకులు మర్చితే, మరి నిఘా వ్యవస్థ ఎందుకు పసిగట్టి ఆ సమ్మేళనాన్ని అడ్డుకోలేకపోయిందన్న మిలియన్ డాలర్ల ప్రశ్నకు పాలకుల వద్ద సమాధానం లేకుండా పోయింది .
ప్రాథమిక దశలోనే కట్టడి చేయాల్సిన కరోనా వైరస్ ను పాలకులు తమ అవగాహన రాహిత్యం వల్ల గేట్లు బార్ల తెరిచి స్వాగతం పలికి , ఇప్పుడేమో లాక్ డౌన్ ను పొడగించాల్సిందేనంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు . లాక్ డౌన్ అంటూ పొడిగిస్తే పాలకులకు వచ్చే నష్టం కన్నాపేదలు ఎదుర్కొనే ఇబ్బందులే అధికమన్నది నిర్వివాదాంశం . కేంద్ర , రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోతే ఆ భారాన్ని ప్రజలపైనే మోపుతారు ... కానీ అదే ఒక పేదవాడి కుటుంబం ఆర్ధికంగా చితికిపోతే, వారిని ఆదుకునేవారెవరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు .
]]>