Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 309352

ఆరోగ్యం: జున్ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!!

$
0
0
సాధార‌ణంగా జున్ను అంటే ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. ఎందుకంటే.. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబ‌ట్టి. కేవ‌లం రుచే కాదు.. జున్నుతో బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా పొందొచ్చు. ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలను జున్ను పాలు అని అంటారు. అటువంటి జున్నులో విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. మ‌రి జున్ను వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎంటీ..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా చేస్తుంది. 

ఇక చాలామంది చూడటానికి చాలా సన్నగా ఉంటారు. అలాంటివారు ప్రతిరోజూ జున్ను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జున్నులోని ప్రోటీన్స్శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. మ‌రియు జున్ను వ‌ల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అలాగే విటమిన్‌ డి లోపం ఉన్న వారు జున్ను తినడం వల్ల ఆ లోపాన్ని సరి చేసుకోవచ్చు. జున్నును తరచూ తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్‌ రాకుండా ఉంటుంది. 



అదేవిధంగా, హైబీపీ ఉన్న వారు జున్ను తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మ‌రియు జున్నులో ఫైబర్ చాలా సమృద్ధిగా ఉంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. జున్నులోనివిటమిన్బి2, ఎ, కె, డి వంటివి జీవక్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి. జున్ను తినడం ద్వారా మీ జీర్ణవ్యవస్థ కూడా చాలా బలంగా ఉంటుంది. ఇక జున్నులో ఉండే విటమిన్‌ ఎ శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
 

]]>

Viewing all articles
Browse latest Browse all 309352

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>