Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297354

లాక్ డౌన్ ఎఫెక్ట్ : సరదాగా బయటకెళ్లారు.. కానీ చివరికి..?

$
0
0
ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఉద్యోగులు వ్యాపారులు అనే తేడా లేకుండా ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే ఇంట్లో గడిపి గడిపి విసుగొచ్చి బయటికి వెళ్దాం అని అనుకున్నప్పటికీ... బయట ఎలాంటి సదుపాయాలు గాని లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నారు. ఇక్కడ లాక్ డౌన్  ఏకంగా ప్రాణాలను బలితీసుకుంది . లాక్ డౌన్ సమయంలో ఇంట్లో కూర్చోవడం బోర్ కొట్టడంతో సరదా కోసం కుందేలును పట్టడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. 


 ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లాక్ డౌన్  సమయంలో ఇంట్లో కూర్చోవడం బోర్ కొట్టడంతో ఆ యువకులు సరదాగా కుందేలు పట్టడానికి వెళ్ళారు. ఇక కుందేలు  కోసం వెతుకుతూ వెతుకుతూ తమ గ్రామ పొలాలు దాటి పక్క గ్రామ పరిధిలో కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే మా గ్రామం వైపు ఎందుకు వచ్చారంట గ్రామ ప్రజలు నిలదీశారు. దీంతో మాట మాట పెరిగి ఇరువర్గాల మధ్య దాడి జరిగేంత వరకు వెళ్ళింది పరిస్థితి. అనంతపురం జిల్లాలోని బత్తల పల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామ పరిధిలోని పెద్ద కొట్టాల కాలనీకి చెందిన.. నిరంజన్, పవన్అనే ఇద్దరు యువకులు ఇంట్లో కూర్చుని బోర్ కొట్టి సరదాగా కుందేళ్లు పట్టడానికి వెళ్ళారు. 




 ఈ క్రమంలోనే ఆ గ్రామ పరిధి దాటి  వేరే  గ్రామంలోకి వెళ్లి మరి కుందేళ్లను వెతకడం ప్రారంభించారు. ఇంతలో అక్కడి పొలాల యజమానులు వచ్చి మా గ్రామంలో కి ఎందుకు వస్తున్నారు  అంటూ నిలదీశారు. దీంతో వారి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం జరిగింది. ఇక యువకులు పక్క గ్రామం నుంచి వచ్చి మరి గొడవకు దిగారు అని ఆగ్రహంతో ఊగిపోయిన పెద్ద కొట్టాల గ్రామస్తులు... యువకులు పొలం నుంచి వెళ్లకుండా అడ్డంగా కంచె వేశారు. దీంతో కుందేలు కోసం ప్రారంభమైన వేట కంచల వరకు దారి తీసింది. ఇక కంచె  వద్దకు చేరుకున్న ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఇరువర్గాలలో  పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందగా..  ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో  సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల పై కేసు నమోదు చేశారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 297354

Trending Articles