దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ప్రభావం ఉండడంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ దశలో తెలంగాణసీఎం కేసీఆర్కూడా మరికొద్ది రోజులు లాక్ డౌన్ నిబంధన పొడిగించాలంటూ ప్రధానిని కోరినట్లు చెప్పారు అంతేకాకుండా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా ఇదే విధంగా రిపోర్ట్ ఇచ్చిందని దాని ప్రకారం ఇండియాలో జూన్ 3 వరకు లాక్ డౌన్ నిబంధన పొడిగించాలంటూ కేసీఆర్డిమాండ్ చేశారు. అయితే దీనిపై తాజాగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ స్పందించింది.
లాక్ డౌన్ పొడిగింపు కి సంబంధించి ఎటువంటి నివేదిక ఇప్పటి వరకు ఇవ్వలేదని భారత్తో పాటు ప్రపంచానికి సంబంధించి లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ఎటువంటి నివేదిక ఇవ్వలేదని, మేము నివేదిక ఇస్తున్నట్లుగా సోషల్ మీడియాలోనూ, ఇతర సామజిక మాధ్యమాల్లోనూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. అయితే ఇప్పటికే మీడియాలో నిబంధనలకు సంబంధించి అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు స్వయంగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ స్పందన తెలియజేయడంతో ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.
]]>