అయితే ఈ కరోనాను కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఇందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనాప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనాముంచుకొస్తుంది.
ఇకపోతే కరోనానుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనాపై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చచేస్తున్నారు. ఇక అభిమానులు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు.
అసలు విషయానికొస్తే.. ఇలా చేస్తే కరోనారాదు.. అలా చేస్తే కరోనారాదు అంటూ సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అలా కనుక చేస్తే ఇంకా మీ పని గోవిందా అనే చెప్పాలి. యూట్యూబ్లో చుసిన ఒక వీడియో ద్వారా నల్ల మినిస కాయలను తింటే కరోనారాదనీ చెబితే.. అలా చేస్తే నిజంగానే కరోనారాదా అని వాటిని తిని ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మీరు అలాంటి పనులు చేయకండి.. అంటూ ప్రముఖులు అంటున్నారు..