Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297354

ప్రపంచానికే ఆదర్శం గా నిలిచిన క్యూబా .. వీళ్ళ లాగా చేస్తే నో కరోనా !

$
0
0
ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు అగ్రరాజ్యాలు అని చెప్పుకునే దేశాల్లో ఇవి కూడా కరోనా వైరస్దెబ్బకు చేతులు ఎత్తేస్తున్నాయి. చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ప్రస్తుతం యూరప్దేశాలకు అదేవిధంగా అగ్రరాజ్యం అమెరికాని ఓ ఆట ఆడుకుంటుంది. టెక్నాలజీపరంగా సైనికపరంగా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని అనుకున్న అమెరికాలో ప్రస్తుతం కరోనాపాజిటివ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. ఇదే తరుణంలో చాలామంది అమెరికన్లు మృత్యువాత పడుతున్న గాని డోనాల్డ్ ట్రంప్మాత్రం ఆంక్షలు విధించటం లేదు. అదేవిధంగా దేశీయ విమాన రాకపోకలు కూడా ఆపక పోవడం పట్ల అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో నెలకొంది.

ప్రపంచంలో అన్ని దేశాలు పరిస్థితి ఎలా ఉన్నా గాని క్యూబాలో మాత్రం కరోనా వైరస్చాలా కంట్రోల్ లో ఉండటంతో.. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అంతే కాకుండా తనని శత్రుదేశం గా భావించిన అమెరికాకి,  ఫ్రాన్స్, జర్మనీవంటి దేశాలకు క్యూబావైద్య బృందాలను పంపి తనలో ఉన్న మానవత్వాన్ని బయటపెట్టింది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవటంతో కేవలం 65 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంతేకాకుండా ఒకరు మాత్రమే మరణించారు.



ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్వల్ల చాలా దేశాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో క్యూబాదేశం మాస్క్ లు, వైద్య పరికరాలను పంపిస్తూ సాయం చేస్తోంది. ముఖ్యంగా ఈ దేశంలో ప్రతి వంద మందిలో ఎనిమిది మంది డాక్టర్లు ఉండటంతో...తమ దేశం నుండి ఇతర దేశాలకు వైద్యులను పంపుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో క్యూబాదేశం లాగా ప్రతి దేశం ఆలోచించి సహకరించకుంటే నో కరోనాఅని అంతర్జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. 

]]>

Viewing all articles
Browse latest Browse all 297354

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>