Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305735

కే‌సి‌ఆర్ చెప్పినది అమలు చేయనున్న మోడి .. ఇది నూతన ఒరవడి !

$
0
0
మానవ మనుగడకే ప్రమాదకరంగా మారింది కరోనావైరస్. మూడు నెలల్లోగా యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో తీవ్రత చాలా తక్కువ గానే ఉందని అనుకుంటున్న తరుణంలో ఇటీవల ఉన్న కొద్దీ పాజిటివ్ కేసులు బయటపడటంతో కేంద్రంలో మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో అలజడి నెలకొంది. అమలులో ఉన్న లాక్ డౌన్ ఇంకా పొడిగించాలని చాలామంది రాష్ట్రాలకు చెందిన నాయకులు అదే విధంగా కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రతిపాదిస్తున్నారు. తాజాగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రిసీఎం కేసీఆర్కూడా లాక్ డౌన్ ఇంకా కొనసాగితే బాగుంటుందని కేంద్రప్రభుత్వానికి సూచించారు.

 


ఈ భయంకరమైన వైరస్ దేశంలో పూర్తిగా నిర్మూలన అయిన తరువాత లాక్ డౌన్ ఎత్తివేయాలని...లేకపోతే దేశం మరో ఇటలీమరియు స్పెయిన్లాగా అవుతుందని కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా నష్టపోయిన ప్రజల ప్రాణాలే ముఖ్యమని.. ప్రజలు బాగుంటే రేపైనా సంపాదించుకోవచ్చని కేసీఆర్చెప్పారు. అందుకే లాక్ డౌన్ పొడిగింపు ఉండాల్సిందే అన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనే అంతర్జాతీయసంస్థ కూడా.. జూన్ 3 వరకూ లాక్ డౌన్ పొడిగించాలని నివేదిక ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు.


 


ఇదే టైములో ప్రధానిమోడీకూడా కేంద్రప్రభుత్వంలో అధికారులతో ఈ విషయం గురించి చర్చించినట్లు లాక్ డౌన్ ఇంకా పొడిగించడానికి చర్చలు జరుపుతున్న టైములో కేసీఆర్వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కేసీఆర్వ్యాఖ్యలు హైలైట్ అయ్యాయి. దీంతో కెసిఆర్ చెప్పినది కూడా నిజమే అని కేంద్ర ప్రభుత్వఅధికారులతో మోడీఅన్నట్లు, లాక్ డౌన్ పొడిగించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. నిజంగా కేసీఆర్మాట ప్రకారం లాక్ డౌన్ మోడీపొడిగిస్తే కచ్చితంగా ఇది దేశంలో నూతన ఒరవడి అవుతుంది అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

]]>

Viewing all articles
Browse latest Browse all 305735

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>