అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్
ట్రంప్ఏం మాట్లాడినా.. ఏ నిర్ణయం తీసుకున్నా.. అది సంచలనమే.. తాజాగా.. ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. అమెరికాను కరోనా వైరస్ కుదిపేస్తున్న నేపథ్యంలో
ట్రంప్మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు నిధులను నిలిపిశారు. అదేమిటీ..ప్రపంచంలోని అన్ని దేశాలకు కరోనా కట్టడికి ఆర్థిక సాయం అందించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపివేయడం ఏమిటని అనుకుంటున్నారా..? అందుకు బలమైన కారణమే ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు.. చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా కరోనా వైరస్‌ను గుర్తించిన విషయం తెలిసిందే. చూస్తుండగానే ఆ వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. చైనాలోనూ ఈ వైరస్తో సుమారు మూడువేల మందికిపైగా మరణించారు. ఆ తర్వాత యూరప్‌లోని ఇటలీ,
స్పెయిన్తదితర దేశాలను కుదిపేసింది. కొద్దిరోజులుగా కరోనాతో
అమెరికాచిగురుటాకులా వణికిస్తోంది. ఇప్పటికే సుమారు మూడులక్షల మంది వైరస్ బారినపడగా 13వేల మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే.. కరోనా వైరస్ విషయంలో అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్మొదటి నుంచీ చైనాను నిందిస్తున్నారు. వైరస్ గురించి ప్రపంచానికి చెప్పలేదని, అందువల్లే ఈరోజు ఇంతటి విపత్తును ప్రపంచం ఎదుర్కొంటోందని మండిపడ్డారు. ఒకదశలో కరోనా వైరస్‌ను చైనీస్ వైరస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కాస్త తీవ్రంగానే స్పందించింది. వైరస్‌కు దేశాలు, మతాలు, సరిహద్దులు ఉండవనీ.. చైనీస్ వైరస్ అనడం సరికాదంటూ ట్రంప్‌కు చురకలు అంటించింది. ఇలా చాలా సార్లు చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అండగా ఉన్నట్లు కనిపించింది. ఇక చూస్తుండగానే.. అమెరికాలో వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో అమెరికామొదటి స్థానంలో ఉంది. మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ట్రంప్సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో మరణాల సంఖ్య లక్ష నుంచి రెండున్నర లక్షల దాకా ఉండొచ్చంటూ చెప్పారు. తాజాగా.. డబ్ల్యూహెచ్‌కు నిధులను నిలిపివేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
]]>