పసుపును దంపతుల ఆరోగ్యకర వైవాహిక జీవితానికి చిహ్నంగా భావించబడుతుంది. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల ప్రకారం, ముత్తైదువులందరూ కలిసి వధూవరులిద్దరికీ పసుపును రాయడం ద్వారా దీవెనలను అందించడం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. దీన్ని పెళ్ళికి ముందు గంధం నలుగు, లేదా నలుగుగా జరుపబడుతుంది. అలాగే పసుపు ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు వంటి వాటిని తొలగించడంలో బాగా పనిచేస్తుంది.
వివాహ కార్యక్రమంలో పాల్గొనే వధూ వరులు మరింత ప్రకాశవంతంగా కనిపించాలనే ఉద్దేశంతోనే పసుపును వారికి రాసి స్నానాలు చేయిస్తారు. అంతేకాకుండా.. పసుపులో కర్క్యుమిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. అవి లేకుండా ఉంటేనే కదా ఎవరైనా ఉత్తేజంగా ఉండేది. అందుకోసమే వధూవరులకు పసుపు రాస్తారు. మరియు శరీరంలో చేరిన దుష్ట శక్తులను పారదోలే పవర్ పసుపుకి ఉందట. అందుకే వధూవరులపై ఎలాంటి గాలి, ధూళి లేకుండా ఉండేందుకు కూడా పసుపు రాస్తారు.
]]>