Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

బాబోయ్... అఖిరా బీభత్సం !

$
0
0
అఖిరానందన్ ఈ పేరు తెలియని వారు సినీ జీవులే కాదు. ఎందుకంటే సినిమావార్తలు ఫాలో అయ్యే వారికి ఈ పేరు చిర పరిచితమే. ఆయన తండ్రి, పెద తండ్రి, అన్నయ్యలు,  మామలు అందరూ టాప్ రేంజి హీరోలే. మొత్తానికి అఖిరా అద్రుష్ట జాతకుడు. ఆయన పవర్ స్టార్పవన్కళ్యాణ్ముద్దుల తనయుడు.

పవన్, రేణూ దేశాయ్లకు పుట్టిన అఖిరానందన్  పుట్టిన రోజు ఈ రోజు. మరి పవన్ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి ఒక్కలా లేదు. ఎటు చూసినా భీభత్సమే. సోషల్ మీడియాఅంతా అఖిరా మానియాతో అట్టుడిపోతోంది. అఖిరాను గ్రీట్ చేస్తూ పవన్ఫ్యాన్స్ పెడుతున్న పోస్టింగులలతో రికార్డులు బద్దలవుతున్నాయి. ఆ క్రేజ్ మామూలుగా లేదుగా.



ఇదే రోజు అల్లు  అర్జున్, నాగార్జునకొడుకు అఖిల్బర్త్ డే కూడా. అయితే అల్లు అర్జున్టాప్ రేంజి హీరో. ఆయనతో సమానంగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న అఖిరానందన్ ఫ్యూచర్  స్టార్ గా కొత్త రికార్డులు బద్దలు కొట్టేసేలా ఉన్నాడు.



ఆయన పెదనాన్న చిరంజీవిఅన్నట్లుగా తమ కంటే బిడ్డ ఎత్తు ఎదిగాడు, ఇపుడు సినిమావాసన లేకుండానే సోషల్ మీడియాలో తనదైన మానియాని క్రియేట్ చేసి పారేశాడు. ఇంతకీ అఖిరానందన్ కి సినిమాల్లో నటించాలని ఉందో లేదో కూడా తెలియదు. ఆయన ఇపుడు టీనేజ్ లో ఉన్నాడు.



మరో రెండు మూడేళ్ళకు కానీ హీరోఅవుతాడో లేడో తెలియదు కానీ వస్తే మాత్రం రెడ్కార్పెట్ పరచేసి గుండెల్లో గూడు కట్టేసేందుకు పవన్ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అఖిరానందన్ క్రేజ్ చూసిన వారికి వారేవా తండ్రిని, పెద తండ్రిని కూడా ఈ కుర్రాడు మించేసేటట్లున్నాడే అనిపించకమానదు. మొత్తానికి అఖిరానందన్ భీభత్సమే. ఒక అద్భుతమే.



 


]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>