ఇక బీటెక్ విద్యార్థులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ కోర్సును ఫ్రీగానే పూర్తి చేయొచ్చు. పర్ఫెక్టీవ్ ఎడ్వెంచర్, నేషనల్ ఎడ్యుకేషనల్ అలయెన్స్ ఫర్ టెక్నాలజీ-NEAT సంయుక్తంగా ఇన్ఫర్మేషన్టెక్నాలజీఉద్యోగాలకు సంబంధించి 1,000 ప్రాక్టీస్ పేపర్స్ రూపొందించాయి. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, క్యాప్‌జెమిని, యాక్సెంచర్, ఒరాకిల్, ఐబీఎం, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, విప్రోలాంటి కంపెనీల్లో మీ కెరీర్ ప్రారంభించాలనుకుంటే విద్యార్థులు ఈ లాక్‌డౌన్ సమయాల్లో మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయొచ్చు.
ఈ కోర్స్ పూర్తి చేస్తే క్యాంపస్ డ్రైవ్‌లో అసెస్‌మెంట్, కోడింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కు కావాల్సిన అవగాహన లభిస్తుంది. ఇక మీరు ఈ కోర్సు చేయాలంటే 3 జీ నెట్‌వర్క్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే చాలు. ఈ కోర్సు గురించి మరిన్ని వివారాలు తెలుసుకోవాలంటే.. https://neat.aicte-india.org/వెబ్‌సైట్‌లో job Readiness programme పైన క్లిక్ చేసి తెలుసుకోండి. అలాగే మార్చి 20న ప్రారంభమైన కోర్స్ డిసెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఇలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి.