Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297444

ఆంధ్రప్రదేశ్ @ 348 కరోనా కేసులు ... నేడు కొత్తగా 19 పాజిటివ్ కేసులు ...!

$
0
0
ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో ఈరోజు సాయంత్రానికి గాను ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ పరంగా మొత్తంగా  ఉదయం 9 నుంచి జరిగిన కరోనా వైరస్పరీక్షల్లో కొత్తగా  గుంటూరు జిల్లాలో 8, అనంతపూర్ జిల్లాలో 7, ప్రకాశం జిల్లాలో- 3, పశ్చిమ గోదావరిజిల్లాలో ఒక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి చేరింది.  


ఇక కర్నూలు జిల్లాలో బుధవారం మరో కరోనాపాజిటివ్‌ కేసు నమోదైనట్లు కర్నూల్ జిల్లాకలెక్టర్‌ వీర పాండ్యన్‌ తెలిపారు. దీనితో జిల్లాలో కరోనాకేసుల సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా 75 కి చేరింది. అలాగే ఇక అనంతపురం జిల్లాలో బుధవారం ఒక్కరోజే 7 కరోనాపాజిటివ్‌ కేసులు నమోదైనట్లు DMHO అనిల్‌ కుమార్‌ తెలిపారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం నలుగురు వైద్య సిబ్బందికి సైతం ఈ మహమ్మారి సోకినట్టు నిర్దారణ జరిగిందని ఆయన తెలిపారు.




కర్నూలు జిల్లాలో గత శనివారం వరకు కేవలం నాలుగుగా ఉన్న కరోనా వైరస్కేసులు ఒక్క సారిగా అమాంతంగా 75 కి పెరిగిపోయాయి. దీంతో బుధవారం సాయంత్రానికి కర్నూలు జిల్లాలో మొత్తం రెడ్జోన్లను ఏర్పరిచి వాటికి జియోట్యాగింగ్ చేసి పూర్తిగా కర్ఫ్యూ వాతావరణాన్ని జిల్లామొత్తం ఉంచారు. అయితే ఇందులోని కేసుల్లో అధిక శాతం ఢిల్లీప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు.


ఇక కరోనాకేసులు జిల్లావ్యాప్తంగా చూస్తే...


అనంతపూర్ - 13
చిత్తూర్ - 20
 ఈస్ట్ గోదావరి - 11
 గుంటూరు - 49
 కడప- 28
 కృష్ణ - 35
కర్నూలు  - 75 
నెల్లూరు - 48
ప్రకాశం - 27
శ్రీకాకుళం - 0
 విశాఖపట్నం - 20 
 విజయనగరం - 0
 వెస్ట్ గోదావరి - 22

]]>

Viewing all articles
Browse latest Browse all 297444

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>