Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

నా ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేను : అఖిల్....!!

$
0
0
అక్కినేనిఫ్యామిలీ వారి మూడవతరం వారసుడైన అఖిల్ అక్కినేని, నేడు తన 26వ పుట్టినరోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. చిన్నతనంలోనే తన తండ్రినాగార్జుననటించిన సిసింద్రీసినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన అఖిల్, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక, అక్కినేనిఫ్యామిలీ వారి మూడు తరాల నటులైన ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యకలసి నటించిన మనం సినిమాలోని క్లైమాక్స్ సీన్ లో కొద్దీ క్షణాలు కనపడతారు. అయితే ఆ తరువాత పూర్తిగా స్థాయి హీరోగా మాత్రం మాస్సినిమాల దర్శకుడు వివి వినాయక్దర్శకత్వంలో వచ్చిన అఖిల్సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమాపెద్దగా సక్సెస్కాలేదు. 

ఇక ఆ తరువాత విక్రమ్కుమార్దర్శకత్వంలో వచ్చిన హలొ సినిమాకూడా అఖిల్కి మంచి సక్సెస్ని అందివ్వలేకపోయింది, ఆపై యువదర్శకుడు వెంకీఅట్లూరి దర్శకత్వంలో వచ్చిన మిస్టర్మజ్ను కూడా కేవలం యావరేజ్ విజయాన్ని అందుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న అఖిల్, ఎలాగైనా ఆ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫ్యాన్స్ ని ఖుషిచేయాలని చూస్తున్నారు. 



ఇకపోతే నేడు తన పుట్టినరోజుని చక్కగా తన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన, ముఖ్యంగా తల్లితండ్రులతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, అన్నిటికంటే ముఖ్యం కుటుంబం అని, ఈ ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేనని అఖిల్కాసేపటి క్రితం తన సోషల్ మీడియామాధ్యమం ట్విట్టర్ద్వారా ట్వీట్ చేయగా, ఆ తరువాత ఆయన తల్లి అమల, అతడి ట్వీట్ ని హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ అఖిల్అంటూ రీట్వీట్ చేసారు. కాగా ప్రస్తుతం వారిద్దరి ట్వీట్స్ మీడియామాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి......!! 


]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>